ఎదురులేని నింజాస్‌
నార్త్‌ ఆంధ్ర మరో విజయం
స్ప్రైట్‌ ఈసీసీ కప్‌- 2018
ఈనాడు, హైదరాబాద్‌: స్ప్రైట్‌ ఈసీసీ కప్‌- 2018 అంతర్‌ రాష్ట్ర లీగ్‌ దశలో నార్త్‌ ఆంధ్ర నింజాస్‌ జట్టుకు ఎదురులేకుండా పోయింది. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్‌ రాష్ట్ర లీగ్‌లో సీనియర్స్‌లో రెండో మ్యాచ్‌లోనూ నింజాస్‌ సత్తాచాటింది. సోమవారం మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ ఆంధ్ర నింజాస్‌ మూడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ హీరోస్‌పై విజయం సాధించింది.

టాస్‌ గెలిచిన నార్త్‌ ఆంధ్ర ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ హీరోస్‌ 19.1 ఓవర్లలో 8 వికెట్లకు 101 పరుగులు చేసింది. వినీత్‌రెడ్డి (29; 22 బంతుల్లో 3×4, 1×6), సందీప్‌గౌడ్‌ (14; 20 బంతుల్లో 2×4), వంశీ (12; 14 బంతుల్లో 1×6) రాణించారు. నార్త్‌ ఆంధ్ర బౌలర్లలో ప్రశాంత్‌ (2/13), అజయ్‌ (1/12), యశ్వంత్‌ (1/7) సత్తాచాటారు. అనంతరం నార్త్‌ ఆంధ్ర నింజాస్‌ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. సత్యసాయి కుమార్‌ (34; 18 బంతుల్లో 3×4, 2×6), అజయ్‌ (15; 20 బంతుల్లో 1×6), వంశీకృష్ణ (10; 19 బంతుల్లో 1×4) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో నరేన్‌రెడ్డి (3/18), వంశీ (2/26), గణేశ్‌ (1/16) ప్రతిభ కనబరిచారు. బ్యాటింగ్‌లో మెరిసిన సత్యసాయి కుమార్‌ను ‘స్ప్రైట్‌ స్టార్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద డే’ అవార్డు వరించింది. జూనియర్స్‌లో నార్త్‌ ఆంధ్ర నింజాస్‌ గైర్హాజరవడంతో హైదరాబాద్‌ హీరోస్‌ గెలిచినట్లుగా అంపైర్లు ప్రకటించారు.

హైదరాబాద్‌ హీరోస్‌: 101/8 (వినీత్‌రెడ్డి 29, సందీప్‌గౌడ్‌ 14, వంశీ 12, ప్రశాంత్‌ 2/13, అజయ్‌ 1/12, యశ్వంత్‌ 1/7), నార్త్‌ ఆంధ్ర నింజాస్‌: 102/7 (సత్యసాయి కుమార్‌ 34, అజయ్‌ 15, వంశీకృష్ణ 10, నరేన్‌రెడ్డి 3/18, వంశీ 2/26, గణేశ్‌ 1/16)

మరిన్ని

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.