ప్రధానాంశాలు

ఈసీసీ కప్‌: సూపర్‌ ఓవర్‌లో తేలిన ఫలితం
అనంతపురం క్రీడలు: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈనాడు ఛాంపియన్‌ క్రికెట్‌ పోటీలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. అన్ని విభాగాల్లోనూ పోటీ తీవ్రంగా ఉంది. విజయం కోసం అన్ని జట్లు కఠినంగా సాధన చేస్తున్నాయి. ఈసారి అనంతరంపురంలో అమ్మాయిల క్రికెట్‌లో సూపర్‌ ఓవర్‌లో ఫలితం తేలడం సంచలనంగా మారింది.

అనంతపురం, చిత్తూరు జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సమానంగా 106 పరుగులు చేశాయి. ఫలితం తేల్చేకునేందుకు నిర్వాహకులు సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. నిర్ణయాత్మక ఓవర్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అనంతపురం మూడు బంతులు ఆడి ఒక్క పరుగే చేసింది. ఒత్తిడిలో వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు తొలి బంతికే వికెట్‌ చేజార్చుకోవడం ఉత్కంఠ మొదలైంది. తర్వాతి రెండు బంతుల్లో రెండు పరుగులు రావడంతో చిత్తూరును విజయం వరించింది. దీంతో హోరాహోరీ పోరులో సంచలన విజయం సాధించిన చిత్తూరు జట్టులో ఆనందం పరవళ్లు తొక్కింది.

అంతకు ముందు.. తొలుత బ్యాటింగ్‌ చేసిన చిత్తూరు 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన అనంతపురం జట్టుకు చివరి ఓవర్‌లో విజయానికి 4 పరుగులు అవసరం కాగా మూడు పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై అయింది.

మరిన్ని

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.